బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ జాతీయ గీతాన్ని అవమానించారంటూ ఢిల్లీ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు నమోదయింది. ప్రో కబడ్డీ లీగ్స్ లో భాగంగా గురువారం ముంబైలో జరిగిన ఓ మ్యాచ్ కు హాజరైన సన్నీ లియోన్.. మ్యాచ్ ప్రారంభానికి ముందు 'జనగణమన..'ను ఆలపించారు. అయితే పదాలు పలకడం దగ్గర్నుంచి, రాగం ఆలపించడం వరకు ఆమె పొరపాట్లు చేశారని, తద్వారా జాతీయ గీతాన్ని అవమానించారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ప్రో కబడ్డీ లీగ్స్ లో జాతీయ గీతాలాపనపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. గత సీజన్ లో ఓ మ్యాచ్ సందర్భంగా బిగ్ బి అమితాబ్ జనగణమన ను సరిగా ఆలపించలేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Published Fri, Jul 22 2016 6:00 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement