
గౌరవంగా భావిస్తున్నా : కమల్
ఇన్నాళ్లు ప్రచార కర్తగా వ్యవహరించేందుకు అంగీకరించని కమల్ హాసన్ ఇటీవల కాలంలో మనసు మార్చుకున్నాడు. పలు ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరించటంతో పాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం కమల్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తమిళ వర్షన్ ప్రసారం అవుతుండగా మరో కార్యక్రమం ద్వారా బుల్లితెరపై అలరించేందుకు రెడీ అవుతున్నాడు లోకనాయకుడు.
తొలిసారిగా ప్రో కబడ్డి లీగ్ లో బరిలో దిగుతున్న తమిళ తలైవార్స్ టీంకు కమల్ హాసన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కమల్, కబడ్డీ టీం కోసం పనిచేయటం గౌరవంగా భావిస్తున్నానన్నారు. మన పూర్వీకుల ఆటను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు తన వంతు సాయం చేస్తానన్నారు. ఈ నెల 28 నుంచి ప్రొకబడ్డీ లీగ్ ప్రసారం కానుంది.