
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ డిసెంబర్ 22 నుంచి మొదలుకానుంది. అయితే మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎనిమిదో సీజన్ ఒకే ఒక వేదికలో నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌లన్నీ బెంగళూరులోనే నిర్వహిస్తామని లీగ్ కమిషనర్, మశాల్ స్పోర్ట్స్ సీఈఓ అనుపమ్ గోస్వామి తెలిపారు. గతేడాది వైరస్ భయాందోళనల నేపథ్యంలో ఈవెంట్‌ను రద్దు చేశారు. పీకేఎల్–7 చివరిసారిగా 2019లో జరగ్గా బెంగాల్ వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది.