బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మూడో ఓటమి చవిచూసింది. పట్నా పైరేట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–31తో పరాజయం పాలైంది. తెలుగు టైటాన్స్ తరఫున అంకిత్ బెనివాల్ 10 పాయింట్లు స్కోరు చేశాడు. మోనూ గోయట్ (7), సచిన్ (6), ప్రశాంత్ (5) రాణించి పట్నా విజయంలో కీలకపాత్ర పోషించారు.
మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 31–28తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. వారియర్స్ స్టార్ ప్లేయర్ మణీందర్ సింగ్ 13 పాయింట్లు స్కోరు చేయడంతోపాటు పీకేఎల్ చరిత్రలో 800 రెయిడింగ్ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో యు ముంబా; యూపీ యోధతో తమిళ్ తలైవాస్ తలపడతాయి.
చదవండి: SA vs IND: టీమిండియాకు భారీ షాక్.. వన్డే సిరీస్‌కు కోహ్లి దూరం!
Comments
Please login to add a commentAdd a comment