prokabaddi league
-
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేతగా పుణెరి పల్టన్
ప్రో కబడ్డీ లీగ్ 2023-24 సీజన్ విజేతగా పుణెరి పల్టన్ నిలిచింది. హైదరాబాద్ వేదికగా హర్యానా స్టీలర్స్‌తో జరిగిన ఫైనల్లో 28-25 తేడాతో విజయం సాధించిన.. పల్టన్ తొలి సారి ట్రోఫిని ముద్దాడింది. మ్యాచ్ మొదటి నుంచీ హర్యానాపై ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చిన పుణెరి పల్టన్.. చివరికి టైటిల్ సొంతం చేసుకుంది. పుణెరి పల్టన్ ఛాంపియన్స్‌గా నిలవడంలో ఆ జట్టు రైడర్ పంకజ్ మోహితే 9 పాయింట్లతో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు మరో రైడర్ మోహిత్ గోయత్ 5 పాయింట్లు సాధించాడు. ఇక టాకిల్స్‌లో గౌరవ్ 4 పాయింట్లతో సత్తాచాటాడు. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మూడో ఓటమి చవిచూసింది. పట్నా పైరేట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–31తో పరాజయం పాలైంది. తెలుగు టైటాన్స్ తరఫున అంకిత్ బెనివాల్ 10 పాయింట్లు స్కోరు చేశాడు. మోనూ గోయట్ (7), సచిన్ (6), ప్రశాంత్ (5) రాణించి పట్నా విజయంలో కీలకపాత్ర పోషించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 31–28తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. వారియర్స్ స్టార్ ప్లేయర్ మణీందర్ సింగ్ 13 పాయింట్లు స్కోరు చేయడంతోపాటు పీకేఎల్ చరిత్రలో 800 రెయిడింగ్ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో యు ముంబా; యూపీ యోధతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. చదవండి: SA vs IND: టీమిండియాకు భారీ షాక్.. వన్డే సిరీస్‌కు కోహ్లి దూరం! -
ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో హరియాణా స్టీలర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రపంచ సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి ఆమె ఒక్కరికే చోటు దక్కడం విశేషం. ఇలాంటి మరిన్ని క్రీడా విశేషాలు మీ కోసం.. -
ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు
ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్‌ను బెంగళూరు బుల్స్ దెబ్బ కొట్టింది. అంచనాలకు మించి రాణిస్తూ వస్తోన్న భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్స్‌కు చేరి ఔరా అనిపించింది.వెస్టిండీస్‌తో ఫ్లోరిడాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడంలో పేసర్ నవదీప్ సైనీ కీలక పాత్ర పోషించాడు.ఇలాంటి మరిన్ని క్రీడా వార్తలు మీకోసం -
ఆగస్టు వినోదం
కబడ్డీ కూత, యాషెస్ సిరీస్, కరీబియన్ క్రికెట్‌తో ఆగస్టు ‘మస్తు మజా’ అందించనుంది. పనిలో పనిగా హైదరాబాద్‌లో షటిల్ రాకెట్లు సమరాన్ని చూపించనున్నాయి. గత నెలలో మొదలైన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ పోటీలు ఈ ఆగస్టులో ఆరు నగరాల్లో కూతపెడతాయి. యాషెస్ సిరీస్‌తో పాటు, విండీస్‌లో భారత్ పర్యటన క్రికెట్ పంట పండించనుంది. ఏస్‌లతో యూఎస్ ఓపెన్, కార్ల స్పీడ్‌తో హంగేరి గ్రాండ్‌ప్రి ‘రయ్ రయ్’మనిపిస్తుంది. అలా ఈ ఆగస్టు ఆటలతో ‘అటెస్ట్’ అయిపోయింది. క్రికెట్ వెస్టిండీస్‌లో భారత్ పర్యటన తొలి టి20: ఆగస్టు 3 రెండో టి20: ఆగస్టు 4 మూడో టి20: ఆగస్టు 6 తొలి వన్డే: ఆగస్టు 8 రెండో వన్డే: ఆగస్టు 11 మూడో వన్డే: ఆగస్టు 14 తొలి టెస్టు: ఆగస్టు 22–26 రెండో టెస్టు: ఆగస్టు 30–సెప్టెంబరు 3 బ్యాడ్మింటన్ ఆగస్టు 6–11: హైదరాబాద్ ఓపెన్ టోర్నీ ఆగస్టు 19–25: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (స్విట్జర్లాండ్) షూటింగ్ ఆగస్టు 15–22: ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ (ఫిన్లాండ్) ఆగస్టు 28–సెప్టెంబర్ 2: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ టోర్నీ (రియో డి జనీరో) ఫార్ములావన్ ఆగస్టు 4: హంగేరి గ్రాండ్‌ప్రి యాషెస్ సిరీస్ తొలి టెస్టు: ఆగస్టు 1–5 బర్మింగ్‌హామ్ రెండో టెస్టు: ఆగస్టు 14–18 లార్డ్స్ మూడో టెస్టు: ఆగస్టు 22–26 లీడ్స్ న్యూజిలాండ్‌లో శ్రీలంక పర్యటన తొలి టెస్టు: ఆగస్టు 14–18 రెండో టెస్టు: ఆగస్టు 22–26 తొలి టి20: ఆగస్టు 31 టెన్నిస్ ఆగస్టు 26–సెప్టెంబర్ 8: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రెజ్లింగ్ ఆగస్టు 12–18: ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ (ఎస్తోనియా) ప్రొ కబడ్డీ లీగ్–7 సీజన్ మ్యాచ్‌లు ఆగస్టు 2–31 చెస్ ఆగస్టు 15–19: ప్రపంచ క్యాడెట్ (అండర్–8, 10, 12) ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ (బెలారస్) ఆగస్టు 20–సెప్టెంబర్ 2: ప్రపంచ క్యాడెట్ (అండర్–8, 10, 12) చాంపియన్‌షిప్ (చైనా) హాకీ ఆగస్టు 17–21: టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ హాకీ టోర్నీ – సాక్షి క్రీడావిభాగం -
తెలుగు టైటాన్స్ తడబాటు
ప్రొ కబడ్డీ లీగ్ కొత్త సీజన్ కూడా తెలుగు టైటాన్స్‌కు నిరాశాజనకంగా ఆరంభమైంది. సొంతగడ్డపై జరిగిన ఆరంభ పోరులో మాజీ చాంపియన్ యు ముంబాకు టైటాన్స్ తలవంచింది. కీలక సమయంలో పాయింట్లు సాధించడంలో విఫలమైన తెలుగు జట్టు... చివర్లో వరుస పాయింట్లతో ప్రత్యర్థికి చేరువగా వచ్చేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైంది. సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌కు చుక్కెదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 31–25 పాయింట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి 17–10తో ఆధిక్యంలో నిలిచిన ముంబా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. సమష్టి వైఫల్యం... టైటాన్స్ ఆటలో ఆరంభం నుంచి కూడా దూకుడు కనిపించలేదు. స్కోరు 1–1తో ఆట మొదలైన తర్వాత సిద్ధార్థ్ ఖాళీ రైడ్‌తో వెనక్కి రావడం మొదలు మ్యాచ్‌లో చాలా వరకు అలాంటి స్థితే కనిపించింది. ముంబా కోర్టులో ఫర్హద్ దొరికిపోవడంతో 4–5తో తొలిసారి వెనుకంజ వేసిన టైటాన్స్ మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత ముంబా ఆధిక్యం 8–5నుంచి 17–8 వరకు సాగింది. తొలి అర్ధ భాగం చివర్లో రాకేశ్, రోహిత్ రైడ్లతో రెండు పాయింట్లు సాధించిన తెలుగు టీమ్ పాయింట్ల ఆధిక్యాన్ని తగ్గించింది. తొలి అర్ధభాగంలో టైటాన్స్ ఒక సారి ఆలౌట్ అయింది. రెండో అర్ధభాగంలో మాత్రం టైటాన్స్ ప్రత్యర్థితో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరోసారి ఆలౌట్ అయినా కూడా టైటాన్స్ మొత్తం 15 పాయింట్లు సాధించగా, ముంబా 14 పాయింట్లు మాత్రమే గెలుచుకుంది. ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో టైటాన్స్‌కు వరుసగా పాయింట్లు వచ్చాయి. అయితే బలమైన డిఫెన్స్‌ను ప్రదర్శించిన ముంబా మ్యాచ్ తమ చేజారుకుండా చూసుకుంది. సిద్ధార్థ్ విఫలం... వేలంలో భారీ మొత్తానికి ధర పలకడంతో పాటు ఎన్నో అంచనాలతో తొలి మ్యాచ్ ఆడిన టైటాన్స్ ఆటగాడు సిద్ధార్థ్ దేశాయ్ నిరాశపర్చాడు. తొలి అర్ధభాగంలో ఆరు సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయాడు. మూడు సార్లు అతడిని ప్రత్యర్థి జట్టు పట్టేయగా, రెండు సార్లు ఉత్త చేతులతో తిరిగొచ్చాడు. ఒకసారైతే ‘డు ఆర్ డై’ రైడ్‌లో కూడా ఖాళీగా రావడంతో టైటాన్స్ పాయింట్ కోల్పోవాల్సి వచ్చింది. అన్యమనస్కంగా కనిపించిన అతడిని కోచ్ రెండో అర్ధభాగంలో తొలి తొమ్మిది నిమిషాలు డగౌట్లోనే కూర్చోబెట్టాడంటే అతని ఆట ఎలా సాగిందో అర్థమవుతోంది. ఎట్టకేలకు తన ఎనిమిదో ప్రయత్నంలో బోనస్ ద్వారా పాయింట్ సాధించిన అతను చివర్లో మాత్రం బాగా ఆడేందుకు ప్రయత్నించాడు. జట్టు సాధించిన ఆఖరి 10 పాయింట్లలో 5 దేశాయ్ రైడింగ్‌లో తెచ్చినవే ఉన్నాయి. టైటాన్స్ తరఫున గరిష్టంగా రజనీశ్ 8 పాయింట్లు సాధించగా, కెప్టెన్ అబోజర్ 2 టాకిల్ పాయింట్లకే పరిమితమయ్యాడు. ముంబా తరఫున అభిషేక్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య టాకిల్ పాయింట్లు సమంగా (10) ఉండగా రైడింగ్ పాయింట్లలో ముంబా 1 ఎక్కువగా సాధించింది. అయితే రెండు సార్లు ఆలౌట్ కావడంతో పోగొట్టుకున్న 4 పాయింట్లే తుది ఫలితంలో తేడాగా మారాయి. మరో మ్యాచ్‌లో విజయంతో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ సీజన్–7లో శుభారంభం చేసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బుల్స్ 34–32 స్కోరుతో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. బెంగళూరు తరఫున పవన్ సెహ్రావత్ 9 పాయింట్లు స్కోరు చేయగా, పట్నా తరఫున పర్దీప్ నర్వాల్ 10, ఇస్మాయిల్ 9 పాయింట్లు సాధించారు. -
హ్యాట్రిక్‌పై కన్నేసిన పైరేట్స్
చెన్నై: డబుల్ చాంపియన్ పట్నా పైరేట్స్ ‘హ్యాట్రిక్’పై కన్నేసింది. ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో శనివారం జరిగే ఫైనల్లో కొత్త జట్టు గుజరాత్‌పై గెలిచి ముచ్చటగా మూడో టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ ఏడాదే బరిలోకి దిగినప్పటికీ గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంది. అరంగేట్రంలోనే ఫైనల్ చేరిన గుజరాత్ ఇప్పుడు ఏకంగా టైటిల్‌తో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ను ముగించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక పట్నా బలమంతా కెప్టెన్ ప్రదీప్ నర్వాలే. సూపర్ రైడ్లతో మ్యాచ్‌లనే మలుపు తిప్పుతున్న ఈ రైడర్ తన ‘సూపర్’ ప్రదర్శనను ఫైనల్లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు. మొత్తానికి మేటి జట్లే ఫైనల్ చేరడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
తెలుగు టైటాన్స్ ఓటమి..
-
తెలుగు టైటాన్స్ ఓటమి..
ముంబయి: ప్రొ కబడ్డీ లీగ్ -2లో బెంగళూరు బుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన తొలి సెమీస్ లో తెలుగు టైటాన్స్‌పై బెంగళూరు బుల్స్ 39-38 తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి 16-10 తేడాతో తెలుగు టైటాన్స్ పై ఆధిక్యంలో ఉన్న బెంగళూరు బుల్స్ రెండో అర్ధభాగంలోనూ జోరు ప్రదర్శించారు. కానీ తెలుగు టైటాన్స్ అనూహ్యంగా పుంజుకోవడంతో ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారు. కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలయ్యారు. మ్యాచ్ చివరి నిమిషాల్లో బెంగళూరు ఆలౌట్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. చివరి రైడ్ కు రాహుల్ రెండు పాయింట్లు తీసుకొస్తే మ్యాచ్ టై అయ్యేది. కానీ, రాహుల్ ఒక్క పాయింట్ తెచ్చాడు. దీంతో టైటాన్స్ ఓటమి పాలైంది.