చెన్నై: డబుల్ చాంపియన్ పట్నా పైరేట్స్ ‘హ్యాట్రిక్’పై కన్నేసింది. ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో శనివారం జరిగే ఫైనల్లో కొత్త జట్టు గుజరాత్‌పై గెలిచి ముచ్చటగా మూడో టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ ఏడాదే బరిలోకి దిగినప్పటికీ గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంది.
అరంగేట్రంలోనే ఫైనల్ చేరిన గుజరాత్ ఇప్పుడు ఏకంగా టైటిల్‌తో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ను ముగించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక పట్నా బలమంతా కెప్టెన్ ప్రదీప్ నర్వాలే. సూపర్ రైడ్‌లతో మ్యాచ్‌లనే మలుపు తిప్పుతున్న ఈ రైడర్ తన ‘సూపర్’ ప్రదర్శనను ఫైనల్లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు. మొత్తానికి మేటి జట్లే ఫైనల్ చేరడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.
రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment