ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేతగా పుణెరి పల్టన్ | Puneri Paltan Win Pro Kabaddi League 2023-24 Title With 28-25 Victory Over Haryana Steelers - Sakshi
Sakshi News home page

Pro Kabaddi League 2023-24 Title Winner: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేతగా పుణెరి పల్టన్

Published Fri, Mar 1 2024 9:48 PM

Puneri Paltan Win Pro Kabaddi League 2023-24 Title - Sakshi

ప్రో కబడ్డీ లీగ్ 2023-24 సీజన్‌ విజేతగా పుణెరి పల్టన్‌ నిలిచింది. హైదరాబాద్‌ వేదికగా హర్యానా స్టీలర్స్‌తో జరిగిన ఫైనల్లో 28-25 తేడాతో విజయం సాధించిన.. పల్టన్‌ తొలి సారి ట్రోఫిని ముద్దాడింది. మ్యాచ్ మొదటి నుంచీ హర్యానాపై ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చిన పుణెరి పల్టన్.. చివరికి టైటిల్ సొంతం చేసుకుంది.

పుణెరి పల్టన్‌ ఛాంపియన్స్‌గా నిలవడంలో ఆ జట్టు రైడర్‌ పంకజ్‌ మోహితే 9 పాయింట్లతో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు మరో రైడర్‌ మోహిత్‌ గోయత్‌ 5 పాయింట్లు సాధించాడు. ఇక టాకిల్స్‌లో గౌరవ్‌ 4 పాయింట్లతో సత్తాచాటాడు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement