నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టీలర్స్ బుధవారం జరిగిన పోరులో 38–28 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. లీగ్‌లో హరియాణాకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మ్యాచ్ ఆరంభంలోనే ఐదు పాయింట్లు సాధించిన హరియాణా అదే జోరులో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
తొలి అర్ధభాగం ముగిసేసరికి 22–14తో నిలిచిన స్టీలర్స్... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ద్వితీయార్ధంలోనూ చెలరేగి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్టీలర్స్ జట్టు అటు రెయిడింగ్‌తో పాటు ఇటు డిఫెన్స్‌లో ఆకట్టుకుంటే... కేవలం రెయిడింగ్‌నే నమ్ముకున్న పల్టన్‌కు పరాజయం తప్పలేదు. స్టీలర్స్ తరఫున శివమ్ 13 పాయింట్లు సాధించగా... పుణేరి పల్టన్ తరఫున పంకజ్ 11 పాయింట్లతో పోరాడాడు.
లీగ్‌లో 14 హోయ్చ్‌లు ఆడిన హరియాణా స్టీలర్స్ 11 విజయాలు, 3 పరాజయాలతో 56 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... పుణేరి పల్టన్ 14 మ్యాచ్‌లాడి 6 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘టై’లతో 42 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 39–37 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది.
గుజరాత్ తరఫున గుమన్ సింగ్ 12 పాయింట్లతో సత్తా చాటగా... వారియర్స్ తరఫున మణిందర్ 11 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment