patna Pirates
-
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మూడో ఓటమి చవిచూసింది. పట్నా పైరేట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–31తో పరాజయం పాలైంది. తెలుగు టైటాన్స్ తరఫున అంకిత్ బెనివాల్ 10 పాయింట్లు స్కోరు చేశాడు. మోనూ గోయట్ (7), సచిన్ (6), ప్రశాంత్ (5) రాణించి పట్నా విజయంలో కీలకపాత్ర పోషించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 31–28తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. వారియర్స్ స్టార్ ప్లేయర్ మణీందర్ సింగ్ 13 పాయింట్లు స్కోరు చేయడంతోపాటు పీకేఎల్ చరిత్రలో 800 రెయిడింగ్ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో యు ముంబా; యూపీ యోధతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. చదవండి: SA vs IND: టీమిండియాకు భారీ షాక్.. వన్డే సిరీస్‌కు కోహ్లి దూరం! -
టైటాన్స్‌ది అదే కథ.. అదే వ్యథ
హైదరాబాద్: ప్రో కబడ్డీ సీజన్-7లో తెలుగు టైటాన్స్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. హ్యాట్రిక్ ఓటమి అనంతరం కూడా టైటాన్స్ ఆటగాళ్ల తీరు మారలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో కనీస పోరాట పటిమను ప్రదర్శించిన టైటాన్స్ ఆటగాళ్లు పట్నా పైరేట్స్ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. పట్నా డిఫెండింగ్ ధాటికి టైటాన్స్ రైడర్లు పూర్తిగా తేలిపోయారు. టైటాన్స్ స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ ఓ మోస్తారుగా రాణించగా.. గత మ్యాచ్ హీరో సూరజ్ దేశాయ్ పూర్తిగా నిరాశపరిచాడు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 34-22 తేడాతో టైటాన్స్‌ను చిత్తు చేసింది. పట్నా స్టార్ రైడర్, సారథి పర్దీప్ నర్వాల్ 7 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. డిఫెండర్ జైదీప్ 6 పాయింట్లతో టైటాన్స్ పనిపట్టాడు. పట్నా ధాటికి టైటాన్స్ తొలి రెండు నిమిషాలు ఖాతానే తెరవలేదు. దీంతో 0-4తో వెనుకంజలో ఉంది. అయితే ఈ సమయంలో విశాల్ భరద్వాజ్ సూపర్ టాకిల్‌తో టైటాన్స్‌కు రెండు పాయింట్లు అందించి ఖాతా తెరిచాడు. ఈ ఆనందం కూడా టైటాన్స్ అభిమానుల్లో ఎంతసేపు నిలువలేదు. పట్నా ఆటగాళ్లు అటాకింగ్ ఆడటంతో టైటాన్స్ ఆటగాళ్లు విలవిల్లాడారు. దీంతో తొలి ఆర్ధభాగం ముగిసే సరికి టైటాన్స్ జట్టు 9-23 తేడాతో భారీ వెనుకంజలో ఉంది. ఇక రెండో అర్థభాగంలో సిద్దార్థ్ దేశాయ్ ఒంటరి పోరాటంతో స్కోర్ అంతరాన్ని తగ్గించాడు కానీ ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. పట్నా జట్టు 12 రైడ్, 16 టాకిల్ పాయింట్లతో దడదడలాడించగా.. టైటాన్స్ జట్టు 10 రైడ్, 8 టాకిల్ పాయింట్లు మాత్రమే సాధించింది. -
పట్నా vs యు ముంబా
ప్రొ కబడ్డీ ఫైనల్లో నేడు అమీతుమీ సెమీస్‌లో ఓడిన పుణెరి, బెంగాల్ న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో అత్యంత పటిష్ట జట్లుగా పేరుతెచ్చుకున్న డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా, పట్నా పైరేట్స్ తుది పోరుకు అర్హత సాధించాయి. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిల్చిన ఈ జట్లు సెమీఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులపై స్థాయికి తగ్గ ఆటతీరును చూపి ఏకపక్ష విజయాలు సాధించాయి. నేడు (శనివారం) రాత్రి తొమ్మిది గంటల నుంచి జరిగే ఫైనల్లో ముంబా, పట్నా తలపడుతాయి. దీనికి ముందు మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో పుణెరి పల్టన్, బెంగాల్ వారియర్స్ తలపడుతాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో పట్నా పైరేట్స్ 40-21 తేడాతో పుణెరి పల్టన్‌ను చిత్తు చేసింది. ప్రదీప్ నర్వాల్ 10, రోహిత్ కుమార్ 6 రైడింగ్ పాయింట్లు సాధించారు. పుణెరి నుంచి దీపక్ హుడా ఆరు పాయింట్లు సాధించాడు. లీగ్ దశలో ఈ జట్లు రెండు సార్లు తలపడగా డ్రా ఫలితమే వచ్చింది. అయితే లీగ్ మ్యాచ్‌ల్లో చూపించిన తెగువ కీలక సెమీస్‌లో పుణెరి చూపలేకపోయింది. తొలి నిమిషం నుంచే ప్రత్యర్థిపై పట్నా ఎదురుదాడికి దిగింది. రైడ్‌కు వెళితే చాలు పాయింట్ ఖాయం అన్నట్టుగా ఆటగాళ్లు రెచ్చిపోయారు. దీంతో తొమ్మిదో నిమిషంలోనే పుణే ఆలౌట్ అయ్యింది. ఈ ఊపు అలాగే కొనసాగగా.. 12వ నిమిషంలో ప్రదీప్ నర్వాల్ సూపర్ రైడ్‌తో పట్నాకు ఆరు పాయింట్లు దక్కాయి. పుణెరి కోర్టులో ఉన్న నలుగురు ఆటగాళ్లను తను ఒకేసారి అవుట్ చే సి కోర్టును ఖాళీ చేశాడు. దీంతో తొలి అర్ధభాగానికి పట్నా 25-7తో సంపూర్ణ ఆధిక్యం సాధించింది. అయితే ద్వితీయార్ధంలో పుణెరి గేరు మార్చింది. వరుసగా 9 పాయింట్లు సాధించడంతో పాటు పట్నాను ఆలౌట్ చేసింది. ఆ తర్వాత వెంటనే పుంజుకున్న పట్నా తిరిగి పైచేయి సాధించింది. పట్నా సూపర్ రైడింగ్ ముందు పుణెరి డిఫెన్స్ పూర్తిగా తేలిపోవడంతో వారికి పరాజయం తప్పలేదు మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 41-29 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను మట్టికరిపించింది. రిషాంక్ దేవ డిగ 11, అనూప్ కుమార్ 6 రైడ్ పాయింట్లు సాధించారు. ఆది నుంచే చెలరేగిన ముంబా ఆటగాళ్లు ప్రత్యర్థిని తొమ్మిదో నిమిషంలో ఆలౌట్ చేశారు. ఆ తర్వాత కూడా బెంగాల్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ప్రథమార్ధం 26-8తో ముగించింది. ద్వితీయార్ధంలోనూ బెంగాల్ ఏమాత్రం ప్రభావం చూపకపోగా ముంబా ఆటగాళ్లు చ కచకా పాయింట్లు సాధిస్తూ తమ స్కోరును పెంచుకుంటూ వెళ్లడంతో విజయం ఖాయమైంది. -
టైటాన్స్‌కు నాలుగో ఓటమి
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 26-35 పాయింట్ల తేడాతో ఓడింది. ప్రారంభం నుంచే జైపూర్ ఆటగాళ్లు టైటాన్స్‌పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు. ఏ దశలోనూ తెలుగు ఆటగాళ్లు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి 19-11తో జోరు మీదున్న జైపూర్ ఆ తర్వాత కూడా అదే స్థాయి ఆటను కనబరిచింది. ఈ జట్టు నుంచి సోను నర్వాల్ మరోసారి రాణించి 9 రైడ్ పాయింట్లతో అదరగొట్టగా, కుల్దీప్ 4 టాకిల్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 32-27తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్ తలపడుతుంది.