టైటాన్స్‌కు నాలుగో ఓటమి | Taitans 4th defeat | Sakshi
Sakshi News home page

టైటాన్స్‌కు నాలుగో ఓటమి

Published Wed, Feb 17 2016 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

Taitans 4th defeat

పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 26-35 పాయింట్ల తేడాతో ఓడింది. ప్రారంభం నుంచే జైపూర్ ఆటగాళ్లు టైటాన్స్‌పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు. ఏ దశలోనూ తెలుగు ఆటగాళ్లు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి 19-11తో జోరు మీదున్న జైపూర్ ఆ తర్వాత కూడా అదే స్థాయి ఆటను కనబరిచింది. ఈ జట్టు నుంచి సోను నర్వాల్ మరోసారి రాణించి 9 రైడ్ పాయింట్లతో అదరగొట్టగా, కుల్దీప్ 4 టాకిల్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 32-27తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement