హరియాణా జోరుకు ఢిల్లీ చెక్
ప్రొ కబడ్డీ లీగ్
పుణే: రెండు వరుస పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–11)లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 36–32తో గుజరాత్ జెయంట్స్‌పై విజయం సాధించింది. స్టార్ రెయిడర్, కెప్టెన్ పవన్ సెహ్రావత్ (12 పాయింట్లు) కూతకెళ్లిన ప్రతీ సారి ప్రత్యర్థుల్ని హడలెత్తించాడు. 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచర రెయిడర్ ఆశిష్ నర్వాల్ (6) కూడా రాణించాడు. ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ (18) అదరగొట్టాడు.
ప్రథమార్ధం ముగిసే ఆఖరి నిమిషంలో గుజరాత్ ఒకసారి తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేస్తే... ద్వితీయార్ధంలో పవన్, ఆశిష్, విజయ్‌లు చెలరేగడంతో ప్రత్యర్థి జట్టును స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఆలౌట్ చేసి మ్యాచ్ గెలిచింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ గుమన్ సింగ్ (9), రాకేశ్ (10) రెయిడింగ్‌లో ఆకట్టుకున్నారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సంపాదించిన హరియాణ స్టీలర్స్‌కు దబంగ్ ఢిల్లీ షాకిచ్చిoది.
ఢిల్లీ జట్టు 44–37తో స్టీలర్స్‌పై గెలుపొందింది. రెయిడర్, ఢిల్లీ కెపె్టన్ అషు మాలిక్ (15) అద్భుతంగా రాణించాడు. అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచరుల్లో రెయిడర్ నవీన్ (7), డిఫెండర్లు యోగేశ్ (4), ఆశిష్ (5) రాణించారు. హరియాణా జట్టులో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (9), రెయిడర్ శివమ్ పతారే (6) ఆదుకున్నారు.
సంజయ్, నవీన్, వినయ్ తలా 3 పాయింట్లు చేశారు. జైదీప్, రాహుల్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు (ఆదవారం) జరిగే పోటీల్లో తమిళ్ తలైవాస్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్... యు ముంబాతో యూపీ యోధాస్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment