టైటాన్స్ ఘనవిజయం
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై అద్భుత ఆటతీరు కనబరిచిన తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఢిల్లీ దబంగ్ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 45-34 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 26-10తో 16 పాయింట్ల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో అర్ధభాగంలోనూ టైటాన్స్ తమ జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. టైటాన్స్ జట్టులో కెప్టెన్ రాహుల్ చౌదరీ, రోహిత్ బలియాన్ 11 పాయింట్ల చొప్పున సాధించి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఢిల్లీ జట్టులో కాశీలింగ్ 12 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 10 పాయింట్లు స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 29-28తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది.
ప్రొ కబడ్డీ లీగ్
తెలుగు టైటాన్స్ X బెంగాల్ వారియర్స్
వేదిక: విశాఖపట్నం
రాత్రి గం. 8.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం