Delhi dabang team
-
మాజీ ఛాంపియన్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. సీజన్లో ఏడో విజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 40–34తో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో దబంగ్ ఢిల్లీకిది ఏడో విజయం కావడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ జట్టు 40 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ముంబాతో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు. మంజీత్ ఆరు పాయింట్లు, యోగేశ్ నాలుగు పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 11 పాయింట్లు, గుమన్ సింగ్ 9 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35–33తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. బెంగళూరు బుల్స్ తరఫున సచిన్ నర్వాల్ 9 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 8 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. -
Pro Kabaddi League: దబంగ్ ఢిల్లీకి ఏడో విజయం.. అగ్రస్థానంలోకి
Pro Kabaddi League: Delhi Dabang Beat Patna Pirates: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు ఏడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 32–29తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ సందీప్ నర్వాల్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఈ లీగ్ చరిత్రలో సందీప్ రెయిడింగ్ పాయింట్ల సంఖ్య 250 దాటింది. గుజరాత్ జెయింట్స్, యు ముంబా జట్ల మధ్య మ్యాచ్ 24–24తో ‘టై’ అయింది. చదవండి: IPL 2022 Auction: రాహుల్‌తో పాటు ఆసీస్ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడికి 15 కోట్లు! -
టైటాన్స్ ఘనవిజయం
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై అద్భుత ఆటతీరు కనబరిచిన తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఢిల్లీ దబంగ్ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 45-34 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 26-10తో 16 పాయింట్ల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో అర్ధభాగంలోనూ టైటాన్స్ తమ జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. టైటాన్స్ జట్టులో కెప్టెన్ రాహుల్ చౌదరీ, రోహిత్ బలియాన్ 11 పాయింట్ల చొప్పున సాధించి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఢిల్లీ జట్టులో కాశీలింగ్ 12 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 10 పాయింట్లు స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 29-28తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. ప్రొ కబడ్డీ లీగ్ తెలుగు టైటాన్స్ X బెంగాల్ వారియర్స్ వేదిక: విశాఖపట్నం రాత్రి గం. 8.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
పుణేరి పల్టన్‌కు ఊరట
పుణే : వరుస పరాజయాలతో డీలా పడిన పుణేరి పల్టన్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్-2 చివరి దశలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 33-28 పాయింట్ల తేడాతో ఢిల్లీ దబంగ్ జట్టును ఓడించి తమ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో పుణేరి పాయింట్ల సంఖ్య 19కు పెరిగినా, లీగ్‌లో మాత్రం చివరిదైన ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది. జితేశ్ జోషి ఏడు పాయింట్లు, సంజయ్ కుమార్ ఆరు పాయింట్లు సాధించి పుణేరి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలి అర్ధభాగంలో ఢిల్లీ జోరు కనబరిచినా... రెండో అర్ధభాగంలో పుణేరి జట్టు పుంజుకుంది. విరామ సమయానికి ఢిల్లీ 18-11తో ఏడు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధభాగంలో పుణేరి ఆటగాళ్లు అద్భుత రైడింగ్‌తో ఢిల్లీ జట్టును ఆలౌట్ చేశారు. ఢిల్లీ స్టార్ ప్లేయర్స్ కాశిలింగ్, శ్రీకాంత్ రాణించినా డిఫెన్స్‌లో లోపాల కారణంగా ఆ జట్టు చివర్లో తడబడింది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39-38తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి బెంగాల్ 24-14తో పది పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో జైపూర్ జట్టు పోరాడినా ఆఖరికి పాయింట్ తేడాతో ఓడిపోయింది. సోమవారం జరిగే ఏకైక మ్యాచ్‌లో యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడుతుంది.