ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 40–34తో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో దబంగ్ ఢిల్లీకిది ఏడో విజయం కావడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ జట్టు 40 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ముంబాతో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు.
మంజీత్ ఆరు పాయింట్లు, యోగేశ్ నాలుగు పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 11 పాయింట్లు, గుమన్ సింగ్ 9 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35–33తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. బెంగళూరు బుల్స్ తరఫున సచిన్ నర్వాల్ 9 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 8 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment