సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 మిషన్‌లో రెండో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ కక్ష్య దూరాన్ని మరోసారి తగ్గించారు. అందులోని ఇంధనాన్ని ఆదివారం వేకువజామున 2 గంటలకు స్వల్పంగా మండించి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను రెండోసారి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి 25x134 కిలోమీటర్లు ఎత్తుకు అంటే చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు. మొదటి విడతలో 113 కిలోమీటర్ల దూరాన్ని 25 కిలోమీటర్లకు, 157 కిలోమీటర్ల దూరాన్ని 134 కిలోమీటర్ల తగ్గించి చంద్రయాన్–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువగా తీసుకొచ్చారు.
ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యకరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంవోఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (ఐడీఎస్‌ఎన్) కేంద్రాల్లో శాస్త్రవేత్తలు 23న సాయంత్రం 5.37 గంటలకు ల్యాండర్ మాడ్యూల్‌లో ఉన్న ఇంధనాన్ని స్వల్పంగా మండించి 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవం ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దాదాపు 37 నిమిషాల పాటు జరగనున్న ఈ ఆపరేషన్ అత్యంత కీలకం కానుంది.
చంద్రుడిపై దిగడం విజయవంతమైతే
చంద్రయాన్–3 మిషన్ ప్రయోగంలో అత్యంత కీలకఘట్టం దగ్గర పడడంతో ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఉంది. రష్యా ప్రయోగించిన లూనా–25 మిషన్ చంద్రయాన్–2 తరహాలోనే చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని ఆఖరి దశలో విఫలైమంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో కూడా ఒకింత ఆందోళన మొదలైంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తి చూస్తున్న ఈవెంట్‌ను 23న సాయంత్రం 5.27 గంటలకు ప్రత్యక్షప్రసారాన్ని కల్పిస్తున్నారు. చంద్రయాన్–3లో ల్యాండర్ చంద్రుడిపై దిగే అంశంలో ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్, పేస్‌బుక్, డీడీ నేషనల్ టీవీ చానెల్‌తో సహా బహుళఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉంచారు.
Chandrayaan-3 Updates: మరింత దగ్గరగా చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్
Published Mon, Aug 21 2023 5:34 AM | Last Updated on Mon, Aug 21 2023 7:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment