బెంగళూరు : ప్రొ కబడ్డీ లీగ్-2లో తెలుగు టైటాన్స్ జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. బెంగళూరు బుల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-43 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ జట్టు ఏడు విజయాలు నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడి, మరో మూడింటిని ‘డ్రా’ చేసుకొని మొత్తం 45 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు నిరుటి రన్నరప్ యు ముంబా తమ జోరు కొనసాగిస్తోంది. పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 32-27తో నెగ్గి ఈ సీజన్‌లో 11వ విజయాన్ని తమ ఖాతాలో జమచేసుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో ఢిల్లీ దబంగ్; జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.