పట్నా ఫటాఫట్‌ | Patna Pirates thrashes Bengaluru Bulls by 23 points; Puneri Paltan vs UP Yoddhas ends in thrilling tie | Sakshi
Sakshi News home page

పట్నా ఫటాఫట్‌

Published Wed, Nov 20 2024 8:15 AM | Last Updated on Wed, Nov 20 2024 8:15 AM

Patna Pirates thrashes Bengaluru Bulls by 23 points; Puneri Paltan vs UP Yoddhas ends in thrilling tie

బెంగళూరు బుల్స్‌పై ఘనవిజయం

16 పాయింట్లతో మెరిసిన దేవాంక్‌  

నోయిడా: స్టార్‌ రెయిడర్లు దేవాంక్, అయాన్‌ విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో పట్నా పైరేట్స్‌ ఘనవిజయం సాధించింది. లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో పట్నా పైరెట్స్‌ 54–31 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన పట్నా ప్రత్యర్థికి కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. 

దేవాంక్‌ 16 పాయింట్లు, అయాన్‌ 12 పాయింట్లతో సత్తా చాటారు. బెంగళూరు బుల్స్‌ తరఫున అక్షిత్‌ ధుల్‌ (7 పాయింట్లు) కాస్త పోరాడాడు. స్టార్‌ రెయిడర్‌ ప్రదీప్‌ నర్వాల్‌ ఒక్క పాయింట్‌కే పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా పట్నా 32 రెయిడ్‌ పాయింట్లు సాధిస్తే... బెంగళూరు జట్టు 13కే పరిమితమైంది. ప్రత్యరి్థని మూడుసార్లు ఆలౌట్‌ చేసిన పైరేట్స్‌... తాజా లీగ్‌లో ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 

ఈ ఫలితంతో పాయింట్ల పట్టికలో పట్నా పైరెట్స్‌ మూడో స్థానానికి చేరింది. మరోవైపు బెంగళూరు బుల్స్‌ వరుసగా ఐదో పరాజయం మూటగట్టుకుంది. పుణేరి పల్టన్, యూపీ యోధాస్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 29–29 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యూపీ యోధాస్‌ తరఫున భవానీ రాజ్‌పుత్‌ 10 పాయింట్లు సాధించగా... పల్టన్‌ తరఫున పంకజ్‌ 9 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో భాగంగా నేడు దబంగ్‌ ఢిల్లీతో గుజరాత్‌ జెయింట్స్‌ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తెలుగు టైటాన్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement