
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా రెండు పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు గెలుపు బోణీ చేసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–21తో నెగ్గింది. టైటాన్స్ తరఫున మోనూ గోయట్ 10 పాయింట్లు, సిద్ధార్థ్ దేశాయ్ 7 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 27–22 తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది.