ప్రో కబడ్డీ లీగ్ (పీకెఎల్) సీజన్ - 9 బెంగళూరులో అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గ్రీన్‌కో గ్రూప్ కో–ఫౌండర్, చైర్మన్ శ్రీనివాస్ శ్రీరామనేని, ఎన్‌ఈడీ గ్రూప్‌కు చెందిన మహేష్ కొల్లి, గౌతమ్ రెడ్డి తెలుగు టైటాన్స్ సీజన్ 9 కొత్త జట్టు సభ్యులను పరిచయం చేశారు. తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని మాట్లాడుతూ..''గత సీజన్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ సీజన్‌ను విజయవంతంగా మలుచుకోలుచుకోవాలనుకుంటున్నాం. మా కొత్త స్క్వాడ్‌కి పూర్తి శిక్షణను మా కోచింగ్ సిబ్బంది అందించారు. రాబోయే సీజన్‌లో అభిమానులకు గర్వకారణంగా మా టీమ్ నిలవాలని ఆకాంక్షిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.
తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని నేదురుమల్లి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సీజన్ 9 వివో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. మా టీమ్‌ను గత సీజన్‌తో పోలిస్తే సమూలంగా మార్చాం. ఇప్పుడు మా టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు నూతన యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వెంకటేష్ గౌడ్, మన్జీత్‌ల కాంబినేషన్ టీమ్‌కు కప్‌ను తేగలదని విశ్వసిస్తున్నాం. ఈ సంవత్సరం కప్ గెలవాలన్న ఏకైక లక్ష్యంతో మా టీమ్ పోటీపడుతుంది’’ అని చెప్పారు.
తెలుగు టైటాన్స్ కోచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ‘‘పర్వేష్ భైంశ్వాల్, విశాల్ భరద్వాజ్, సూర్జీత్ సింగ్, రవీందర్ పహల్ టీమ్‌లో ఉన్నారు. వీరు మా ఆటగాళ్లలో అత్యంత కీలక ఆటగాళ్లు’’ అని తెలిపారు. ఇక మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో పాటుగా డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా చూడవచ్చని తెలిపారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9లో తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న బెంగళూరు బుల్స్‌తో ఆడనుంది.
తెలుగు టైటాన్స్ జట్టు: రవీందర్ పహల్ (కెప్టెన్), సిద్దార్ధ్ దేశాయ్, అంకిత్ బెనివాల్, మోను గోయత్, రజ్నీష్, అభిషేక్ సింగ్, వినయ్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, పర్వేష్ భైంశ్వాల్, విజయ్ కుమార్, ఆదర్శ్ , ప్రిన్స్, నితిన్, రవీందర్, మోహిత్, హనుమంతు, ముహమ్మద్ షిహాస్, పళ్ల రామకృష్ణ, మోహసేన్ మగసౌద్లూ, హమీద్ నాడర్, అంకిత్, మోహిత్ పహల్
రిజర్వ్ ప్లేయర్- సుమిత్
తెలుగు టైటాన్స్ మ్యాచ్ షెడ్యూల్..
7 అక్టోబర్ 2022 శుక్రవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs బెంగళూరు బుల్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు
9 అక్టోబర్ 2022 ఆదివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs బెంగాల్ వారియర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు
11 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs పాట్నా పైరేట్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు
15 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs దబాంగ్ ఢిల్లీ కె.సి. శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు
18 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs పుణెరి పల్టన్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు
22 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు
25 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs హర్యానా స్టీలర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు
29 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs గుజరాత్ జెయింట్స్, శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే
31 అక్టోబర్ 2022 సోమవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ Vs U.P. యోద్ధ శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే
2 నవంబర్ 2022 బుధవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs యు ముంబా శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే
5 నవంబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్ శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే
Comments
Please login to add a commentAdd a comment