
ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌కు ఆరో పరాజయం ఎదురైంది. బెంగళూరులో బుధవారం యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 34–45తో ఓడిపోయింది. గత ఐదు మ్యాచ్‌ల్లో బెంగళూరుకిది నాలుగో ఓటమి. బెంగళూరు కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ముంబా జట్టులో అభిషేక్ సింగ్ 11 పాయింట్లు స్కోరు చేశాడు.