
కొచ్చి: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లో యూపీ యోధ, దబంగ్ ఢిల్లీ జట్లు మూడో ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధిం చాయి. ఆదివారం జరిగిన ప్లే ఆఫ్ ఎలిమినేటర్–1లో యూపీ యోధ 34–29తో యు ముంబాపై... ఎలిమినేటర్–2లో దబంగ్ ఢిల్లీ 39–28తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచాయి. నేడు జరిగే క్వాలిఫయర్–1లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్, ఎలిమినేటర్–3లో యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ తలపడనున్నాయి. క్వాలిఫయర్–1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఎలిమినేటర్–3 విజేత జట్టుతో జనవరి 3న క్వాలిఫయర్–2లో తలపడుతుంది. ఈ మ్యాచ్ విజేత ఫైనల్లో రెండో బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment