
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 38–48తో ఓడిపోయింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఐదో పరాజయం కావడం గమనార్హం.
టైటాన్స్ తరఫున గల్లా రాజు ఎనిమిది పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 37–33తో యూపీ యోధపై, పట్నా పైరేట్స్ 27–26తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్; బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధ తలపడతాయి.
చదవండి: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా!