U mubai team
-
PKL 2021: తెలుగు టైటాన్స్‌కు ఐదో ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 38–48తో ఓడిపోయింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఐదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున గల్లా రాజు ఎనిమిది పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 37–33తో యూపీ యోధపై, పట్నా పైరేట్స్ 27–26తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్; బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధ తలపడతాయి. చదవండి: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా! -
జైపూర్పై యు ముంబా గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 37–28తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై నెగ్గింది. యు ముంబా తరఫున అజిత్ కుమార్ 11 పాయింట్లు, జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 42–28తో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. పవన్ కుమార్ 22 పాయింట్లతో మెరిశాడు. విజేతలు మాల్విక, మిథున్ సాక్షి, హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిథున్ మంజునాథ్, మాల్విక బన్సొద్ విజేతలుగా నిలిచారు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో గురువారం ముగిసిన టోర్నీలో రెండో సీడ్ మాల్విక మహిళల సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకోగా, పురుషుల టైటిల్‌ను ఎనిమిదో సీడ్ మిథున్ దక్కించుకున్నాడు. ఫైనల్లో మాల్విక 21–15, 21–9తో టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్‌కు షాకిచ్చింది. మిథున్ 21–15, 21–4తో ఆదిత్య జోషిపై గెలుపొందాడు. మహిళల డబుల్స్ తుది పోరులో సిమ్రన్ సింగ్–ఖుషీ గుప్తా జోడీ 21–16, 21–13తో తెలంగాణకు చెందిన వెన్నెల–శ్రియాన్షి వాలిశెట్టి జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో రవికృష్ణ–శంకర్ ప్రసాద్ ద్వయం 21–9, 21–12తో కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్–సంజన సంతోష్ జోడి విజేతగా నిలిచింది. విజేతలకు టాప్ షట్లర్ సైనా నెహ్వాల్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ బహుమతులు అందజేశారు. చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
ప్రొ కబడ్డీ విజేత యూ ముంబా జట్టు
ముంబయి: ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా యూ ముంబాయి జట్టు నిలిచింది. రెండో సీజన్లో ముంబయిలో ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌పై యూ ముంబా జట్టు ... ఘనవిజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు మొదటి నుంచి దూకుడుగా ఆడి 35-29 తేడాతో విజయం సాధించింది. తొలి అర్థభాగంలో ఆ జట్టుదే పై చేయికాగా, రెండో అర్థభాగంలో బెంగళూరు బుల్స్ కాస్త పుంజుకున్నట్లుగా అనిపించింది. బెంగళూరు బుల్స్ కెప్టెన్ మంజిత్ చిల్లార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ సందర్భంలో యుముంబాకు సమానమైన పాయింట్లు సాధించాడు. అదే క్షణంలో అతడు కాస్త తొందరపడటంతో యు ముంబాకు కలిసి వచ్చింది. చివరి నాలుగు రైడింగ్‌లలో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. ట్రోఫీ యూముంబాను వరించింది. రెండో స్థానంలో బెంగళూరు బుల్స్ నిలిచింది.