ప్రొ కబడ్డీ విజేత యూ ముంబా జట్టు
ముంబయి: ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్ మ్యాచ్లో విజేతగా యూ ముంబాయి జట్టు నిలిచింది. రెండో సీజన్లో ముంబయిలో ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై యూ ముంబా జట్టు ... ఘనవిజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు మొదటి నుంచి దూకుడుగా ఆడి 35-29 తేడాతో విజయం సాధించింది.
తొలి అర్థభాగంలో ఆ జట్టుదే పై చేయికాగా, రెండో అర్థభాగంలో బెంగళూరు బుల్స్ కాస్త పుంజుకున్నట్లుగా అనిపించింది. బెంగళూరు బుల్స్ కెప్టెన్ మంజిత్ చిల్లార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ సందర్భంలో యుముంబాకు సమానమైన పాయింట్లు సాధించాడు. అదే క్షణంలో అతడు కాస్త తొందరపడటంతో యు ముంబాకు కలిసి వచ్చింది. చివరి నాలుగు రైడింగ్లలో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. ట్రోఫీ యూముంబాను వరించింది. రెండో స్థానంలో బెంగళూరు బుల్స్ నిలిచింది.