బెంగళూరు బుల్స్ కెప్టెన్ గా రోహిత్ | Bengaluru Bulls announces Captain for fifth Pro Kabaddi League | Sakshi
Sakshi News home page

బెంగళూరు బుల్స్ కెప్టెన్ గా రోహిత్

Published Sun, Jul 16 2017 1:55 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

బెంగళూరు బుల్స్ కెప్టెన్ గా రోహిత్

బెంగళూరు బుల్స్ కెప్టెన్ గా రోహిత్

బెంగళూరు: త్వరలో ఆరంభం కానున్న ప్రొ కబడ్డీ లీగ్ కు సంబంధించి బెంగళూరు బుల్స్ కెప్టెన్ గా స్టార్ రైడర్ రోహిత్ కుమార్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆదివారం జట్టును ప్రకటించిన బెంగళూరు బుల్స్ యాజమాన్యం.. కెప్టెన్ గా రోహిత్ ను, వైస్ కెప్టెన్ గా రవీందర్ పాహల్ ను నియమించింది. బెంగళూరు బుల్స్ జట్టు కోచ్ గా మాజీ అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు రణధీర్ సింగ్ ను తిరిగి ఎంపిక చేసింది. జూలై 28వ తేదీన ప్రొ కబడ్డీ-5వ సీజన్ ఆరంభం కానుంది. ఈ లీగ్ లో బెంగళూరు జట్టు కొత్త జెర్సీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

బెంగళూరు బుల్స్ జట్టు ఇదే..

రోహిత్ కుమార్(కెప్టెన్), రవీందర్ పాహల్(వైస్ కెప్టెన్), హరిష్ నాయక్, గురివిందర్ సింగ్, అంకిత్ సాంగ్వాన్, మహేందర్ సింగ్, ప్రీతమ్ చిల్లార్, అమిత్, రోహిత్, అశిష్ కుమార్, సచిన్ కుమార్, అమిత్ షిరాన్, కనేషరాజ్, ప్రదీప్, అజయ్ కుమార్, సునీల్, సుమిత్, అంజయ్ శ్రేష్ట, కులదీప్ సింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement