జైపూర్: రైడింగ్‌లో అదరగొట్టిన హరియాణా స్టీలర్స్ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైడర్ వజీర్ సింగ్ (14 పాయింట్లు) కీలక పాయింట్లు సాధించడంతో హరియాణా 32–30తో టైటాన్స్‌పై గెలుపొందింది. స్కోరు 30–30తో సమమైన దశలో వజీర్ సింగ్ 2 రైడ్ పాయింట్లు తెచ్చి హరియాణాకు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో మొత్తం 25 రైడింగ్ పాయింట్లు సాధించిన హరియాణా ట్యాకిల్‌లో కేవలం ఒక పాయింట్ మాత్రమే చేయగలిగింది. మరోవైపు రాహుల్ చౌదరి (11 పాయింట్లు) రాణించడంతో తెలుగు టైటాన్స్ 22 రైడింగ్ పాయింట్లు స్కోర్ చేసింది. ట్యాకిల్‌లోనూ 5 పాయింట్లతో రాణించింది. ఇరుజట్లు చెరో 2 సార్లు ఆలౌటయ్యాయి.
అయితే చివర్లో ఒత్తిడికి చిత్తయిన టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–32తో యు ముంబాపై విజయం సాధించింది. జైపూర్ జట్టులో జస్వీర్ సింగ్ (9 పాయింట్లు) ఆకట్టుకోగా, యు ముంబా జట్టులో కశ్‌లింగ్ అడాకే (6 పాయింట్లు) మెరుగ్గా ఆడాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment