
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లో తెలుగు టైటాన్స్ మూడో ఓటమి మూటగట్టుకుంది. జోన్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 25–30తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 8 పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో ఫర్హద్ (5 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 48–24తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్, యు ముంబాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment