
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన జైపూర్ పింక్ పాంథర్స్ అపజయాల బాటలో పయనిస్తుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36–33తో జైపూర్‌ను చిత్తు చేసింది. స్టార్ రైడర్ దీపక్ హుడా (5 పాయింట్లు) నిరాశపరిచాడు. పట్నా తరఫున ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో చెలరేగగా... జాన్ కున్ లీ (8 పాయింట్లు) అతనికి చక్కని సహకారం అందించాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 42–40తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం.
Comments
Please login to add a commentAdd a comment