
అహ్మదాబాద్: ‘డుబ్కీ’కింగ్ ప్రదీప్ నర్వాల్ విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్ ఏడో విజయం నమోదు చేసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 45–27తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. ప్రదీప్ నర్వాల్ 13, దీపక్ నర్వాల్ 10 పాయింట్లతో సత్తా చాటారు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పైరేట్స్ 16–13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.
తమిళ్ తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ 8 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో మన్‌జీత్ (5 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 39–35తో యు ముంబాపై గెలిచింది. నేటి మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడనుంది.