
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన పోరులో బుల్స్ 38–31తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరుకు ఇది ఐదో విజయం. బుల్స్ తరఫున కెప్టెన్ పవన్ షెరావత్ (18 పాయింట్లు) రాణించాడు.
జైపూర్ జట్టులో అర్జున్ 13 పాయింట్లు చేశాడు. పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 30–30 స్కోరుతో టై అయ్యింది. నేడు జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి.
చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్... ఇక ఆ సిరీస్ కూడా కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment