
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి పుణేరి పల్టన్ నిష్క్రమించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 60–40తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. దబంగ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ మరో సూపర్ ‘టెన్’ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. 22 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతడు 19 పాయింట్లు సాధించాడు. చంద్రన్ రంజిత్ 12 పాయింట్లతో విజయంలో తన వంతు పాత్ర పోషించగా... ట్యాక్లింగ్‌లో రవీందర్ పహల్ ‘హై–ఫై’ (6 పాయింట్ల)తో ప్రత్యరి్థని పట్టేశాడు. పుణే తరఫున నితిన్ తోమర్ (7 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 38–37తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment