పుణెరి, ఢిల్లీ మ్యాచ్ టై | Pro Kabaddi League: Dabang Delhi KC vs Puneri Paltan game ends in a 27-27 tie | Sakshi
Sakshi News home page

పుణెరి, ఢిల్లీ మ్యాచ్ టై

Published Wed, Jun 29 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

పుణెరి, ఢిల్లీ మ్యాచ్ టై

పుణెరి, ఢిల్లీ మ్యాచ్ టై

ముంబై: చివర్లో పట్టు వదలకుండా పోరాడిన పుణెరి పల్టాన్ ఓటమి నుంచి గట్టెక్కింది. మంగళవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్‌ను 27-27తో టై చేసింది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో ఢిల్లీ ఆధిక్యం ప్రదర్శించింది. తొలి పది నిమిషాలు చకచకా పాయింట్లు సాధించినా ఆ తర్వాత అనూహ్యంగా పుణె ఆటగాళ్లు ఢిల్లీని వెనక్కినెట్టారు.మంజిత్ చిల్లార్, దీపక్ నివాస్ హూడా అద్భుతంగా ఆడి ఏడేసి పాయింట్లు సాధించారు.

చివరి ఐదు నిమిషాలు ఆధిక్యం ఇరు జట్ల మధ్య దోబూచిలాడినా మ్యాచ్ టై అయింది.
 ఫైర్ బర్డ్స్ శుభారంభం: తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల కబడ్డీ చాలెంజ్‌లో ఫైర్ బర్డ్స్ జట్టు శుభారంభం చేసింది. ఐస్ డివాస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 25-11తో సునాయాసంగా గెలిచింది.
 
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
తెలుగు టైటాన్స్ X జైపూర్ పింక్ పాంథర్స్
రాత్రి 8 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం
యు ముంబా X పట్నా పైరేట్స్
రాత్రి 9 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement