
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 39–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ జట్టుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. పుణేరి పల్టన్ రెయిడర్ ఇనామ్‌దార్ 17 పాయింట్లు స్కోరు చేశాడు.
బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 13 పాయింట్లతో ఆకట్టుకున్నా అతనికి ఇతర సభ్యుల నుంచి సహకారం లభించలేదు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 42–27తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. యూపీ యోధ రెయిడర్ శ్రీకాంత్ జాదవ్ 15 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్; జైపూర్ పింక్‌పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment