Dabang Delhi K.C victory: Naveen Kumars 22nd straight Super 10 leads - Sakshi
Sakshi News home page

ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్‌ ఢిల్లీ బోణీ.. 16 పాయింట్లతో మెరిసిన నవీన్‌

Published Fri, Dec 24 2021 7:55 AM | Last Updated on Fri, Dec 24 2021 8:37 AM

Naveeen Kumars 22nd straight Super 10 leads Dabang Delhi K.C to victory - Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో దబంగ్‌ ఢిల్లీ జట్టు బోణీ కొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 41–30 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్‌ను ఓడించింది. ఢిల్లీ రెయిడర్‌ నవీన్‌ కుమార్‌ ఏకంగా 16 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 24 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన నవీన్‌ 14 సార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. మ్యాచ్‌లో కనీసం 10 పాయింట్లు స్కోరు చేయడం పీకేఎల్‌లో నవీన్‌కిది వరుసగా 22వ సారి కావడం విశేషం.

ఢిల్లీ ఆల్‌రౌండర్లు విజయ్‌ తొమ్మిది పాయింట్లు, సందీప్‌ నర్వాల్‌ మూడు పాయింట్లు స్కోరు చేశారు. పుణేరి పల్టన్‌ తరఫున కెప్టెన్‌ నితిన్‌ తోమర్‌ ఏడు పాయింట్లు, రాహుల్‌ చౌదరీ ఐదు పాయింట్లు సాధించారు. గురువారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌ 42–39తో హరియాణా స్టీలర్స్‌పై, గుజరాత్‌ జెయింట్స్‌ 34–27తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించాయి.

చదవండి: ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం.. దుమ్మురేపిన హర్నర్‌, యశ్‌దల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement