
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌లో తెలుగు టైటాన్స్ పదో పరాజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 39–40తో బెంగాల్ వారియర్స్ చేతిలో పోరాడి ఓడింది. టైటాన్స్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా ట్యాక్లింగ్‌లో సారథి అ»ొజర్ మోహజెర్ మిఘాని ‘హై–ఫై’ (5 పాయింట్లు)తో చెలరేగినా అది జట్టుకు విజయం అందించలేదు. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్‌గా నిలిచాడు. తాజా విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది.
ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెంగాల్... టైటాన్స్‌ను 15వ నిమిషంలో ఆలౌట్ చేసింది. మొదటి భాగాన్ని 19–13తో ముగించింది. రెండో భాగంలో జోరు పెంచిన టైటాన్స్ ప్రత్యరి్థని ఆలౌట్ చేసింది. ఈ సమయంలో బెంగాల్‌ను రైడింగ్‌తో ఆదుకున్న మణీందర్ గెలుపు ఖాయం చేశాడు. తాజా ఓటమితో టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 43–34తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా సూపర్ ‘టెన్’ (12 పాయింట్లు)తో రాణించాడు. నేటి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment