అహ్మదాబాద్: తొలి 6 నిమిషాల ఆటను చూస్తే దబంగ్ ఢిల్లీదే టైటిల్ అనుకున్నారు. అయితే అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న బెంగాల్ వారియర్స్ సీజన్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న దబంగ్ ఢిల్లీకి షాక్ ఇస్తూ ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 18 పాయింట్లతో జట్టు విజయం కోసం తుది వరకు చేసిన పోరాటం... బెంగాల్ సమష్టి ప్రదర్శన ముందు ఓడిపోయింది. దీంతో శనివారం జరిగిన టైటిల్ పోరులో బెంగాల్ వారియర్స్ 39–34తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. బెంగాల్ తరఫున నబీబ„Š (10 పాయింట్లు), సుకేశ్ హెగ్డే (8 పాయింట్లు), ట్యాక్లింగ్‌లో జీవన్ (4 పాయింట్లు) ప్రదర్శన జట్టుకు టైటిల్‌ను ఖాయం చేసింది.
సీజన్ మొత్తం అద్భుతంగా రాణిస్తూ వచ్చిన ఢిల్లీ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. ఆరంభంలో అద్భుతంగా ఆడి 11–3తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఇక్కడి నుంచి అనూహ్యంగా గాడి తప్పిన ఆ జట్టు మళ్లీ కోలుకోలేకపోయింది. బెంగాల్ స్టార్ రైడర్ మణీందర్ సింగ్ గాయం కారణంగా ఫైనల్ బరిలో దిగలేదు. దీంతో రైడింగ్ భారాన్ని సుకేశ్, నబీబ„Š మోశారు. తొలుత తడబడి పుంజుకున్న వీరు ప్రత్యరి్థని ఆలౌట్‌చేసి విరామానికి స్కోర్‌ను 17–17తో సమం చేశారు. రెండో అర్ధభాగంలో మరింతగా చెలరేగిన బెంగాల్ ప్రత్యరి్థని మరో రెండు సార్లు ఆలౌట్ చేసి కబడ్డీ కింగ్‌గా నిలిచింది. విజేత బెంగాల్ వారియర్స్ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment