అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఐర్లాండ్ మహిళలలతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. తద్వారా ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది.
ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం రెండు మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు.. రెండింట కూడా పరాజయం పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బ్యాటర్లలో వాల్ష్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అన్నాబెల్ స్క్వైర్స్(13), హర్సిన్(10) రాణించారు. పాక్ బౌలర్లలో మెమూనా ఖలీద్ 2 వికెట్లు పడగొట్టగా.. మనహర్ జెబ్, హషిన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 59 పరుగులకే పరిమితమైంది.
పాక్ బ్యాటర్లలో కోమాల్ ఖాన్(12) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో ఎల్లీ మెక్‌గీ రెండు వికెట్లు పడగొట్టగా.. సార్జెంట్, లారా మెక్‌బ్రైడ్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్..
Comments
Please login to add a commentAdd a comment