భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తెరలేచింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు.
ఈ మ్యాచ్‌తో షమీ రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించినప్పటికి.. జట్టు మెనెజ్‌మెంట్ తుది జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించనట్లు తెలుస్తోంది. రెండో టీ20కు షమీ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్ల కోటాలో చోటు దక్కించుకున్నారు.
అయితే రెగ్యూలర్ ఫాస్ట్ బౌలర్ ఒక్క అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, హార్దిక్ పాండ్యా అర్ష్‌దీప్‌తో పాటు బంతిని పంచుకునే అవకాశముంది. బ్యాటింగ్ లైనప్‌లో మాత్రం శాంసన్, అభిషేక్, రింకూ సింగ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.
తుది జట్లు
భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్
ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
Comments
Please login to add a commentAdd a comment