చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ(Tilak Varma) తన అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలో చేధించింది. ఈ క్రమంలో తిలక్ వర్మ ఆసాదరణ బ్యాటింగ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ప్రశంసల వర్షం కురిపించాడు.
"గేమ్ సాగిన తీరు నాకు కాస్త ఉపశమనం ఇచ్చింది. 160 ప్లస్ టార్గెట్‌ను సులువగానే ఛేదించవచ్చని భావించాం. కానీ ఇంగ్లండ్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక్కసారిగా మ్యాచ్ వారి వైపు మలుపు తిరిగింది. మేము గత రెండు, మూడు సిరీస్‌ల నుంచి ఓ అదనపు బ్యాటర్‌తో ఆడుతున్నాము.
అదే బ్యాటర్ మాకు బంతితో రెండు లేదా మూడు ఓవర్లు బౌలింగ్ కూడా వేస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్‌ను ఆడించాము. అయితే గత మ్యాచ్‌లో దూకుడుగా ఆడినట్లే ఇక్కడ పరుగులు రాబట్టడం కుదరలేదు. కానీ ఎటువంటి పరిస్థితులలోనైనా ఆ అగ్రిసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలని ముందే నిర్ణయించుకున్నాము.
ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ చిన్న చిన్న భాగస్వామ్యాలను నెలకొల్పారు. మా విజయంలో ఆ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషించాయి. మ్యాచ్ మధ్యలో కాస్త నేను కంగారు పడ్డాను. ఇవన్నీ ఆటలో భాగమే అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఆ సమయంల తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అతడు బ్యాటింగ్ చేసిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడు బాధ్యత తీసుకుని జట్టును గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. బిష్ణోయ్ కూడా ఈ రెండు మ్యాచ్‌ల్లో వికెట్ లెస్‌గా ఉండవచ్చు గానీ, అతడు నెట్స్‌లో చాలా కష్టపడుతున్నాడు.
బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ఎక్కువగా చేస్తున్నాడు. ఈ రోజు బంతితో రాణించికపోయిన బ్యాట్‌తో రవి తన వంతు సహకారం అందించాడు. అర్షదీప్ కూడా ఆఖరిలో విలువైన పరుగులు చేశాడు. మా కుర్రాళ్లు నాపై ఒత్తిడి తగ్గించారు. దీంతో నేను స్వేఛ్చగా వెళ్లి ఆడేందుకు మార్గం సుగమమైంది. సీనియర్లు, యువకులతో డ్రెస్సింగ్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందరూ ఒకే మాటపై ఉంటే ఫలితాలు కూడా సానుకూలంగా వస్తాయి’’ అని సూర్యకుమార్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment