కోల్‌కాతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్‌ను 12.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. ఈ విజయంతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 79(5 ఫోర్లు, 8 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
స్కోర్లు: ఇంగ్లాండ్132(20) భారత్ 133/3(12.5)
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల దాటికి కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. తొలి ఓవర్‌లోనే విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.
ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్‌లో బెన్ డకెట్‌ను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్‌లో హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.
44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఓవరాల్‌గా భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.
తుది జట్లు
భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్
ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్..
Comments
Please login to add a commentAdd a comment