ఇంగ్లండ్‌తో రెండో టీ20.. వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన అర్ష్‌దీప్‌ | Arshdeep Singh Aims To Break Haris Rauf's Rare Bowling Feat In IND vs ENG 2nd T20I | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టీ20.. వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన అర్ష్‌దీప్‌

Published Sat, Jan 25 2025 4:40 PM | Last Updated on Sat, Jan 25 2025 4:49 PM

Arshdeep Singh Aims To Break Haris Rauf's Rare Bowling Feat In IND vs ENG 2nd T20I

చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌ శనివారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్‌లో ఆధిక్యం పెంచుకోవాలని భారత జట్టు యోచిస్తోంది.

అందుకు తగ్గట్టు తమ ఆస్త్రశాస్త్రాలను భారత్‌ సిద్దం చేసుకుంది.  ఇక చెపాక్‌ టీ20కు ముందు భారత యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌(Arshdeep Singh)ను ఓ వరల్డ్‌ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ మరో మూడు వికెట్లు పడగొడితే.. టీ20ల్లో అత్యంతవేగంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న ఫాస్ట్‌బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అర్ష్‌దీప్‌ ఇప్పటివరకు 61 మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్‌ స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హరీస్ రౌఫ్ పేరిట ఉంది. రౌఫ్‌ 71 మ్యాచ్‌ల్లో వంద వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. చెపాక్‌ టీ20లో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు తీస్తే ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంటాడు. అర్ష్‌దీప్‌ ఉన్న ఫామ్‌లో రౌఫ్‌ రికార్డు బద్దలు అవ్వడం ఖాయం.

తొలి టీ20లో కూడా ఈ పంజాబీ పేసర్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20ల్లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అర్ష్‌దీప్‌(97) రికార్డులకెక్కాడు.

టీ20ల్లో అత్యంతవేగంగా 100 వికెట్లు తీసిన ఫాస్ట్‌ బౌలర్లు వీరే..
హ్యారీస్‌ రౌఫ్‌ - పాకిస్తాన్‌ (71 మ్యాచ్‌లు)
మార్క్‌ అడైర్‌-ఐర్లాండ్‌(72 మ్యాచ్‌లు)
బిలాల్‌ ఖాన్‌-ఒమన్‌(72 మ్యాచ్‌లు)
షాహీన్‌షా అఫ్రిది- పాకిస్తాన్‌(74 మ్యాచ్‌లు)
లసిత్‌ మలింగ-శ్రీలంక(76 మ్యాచ్‌లు)
చదవండి: ముంబైను చిత్తు చేసిన జమ్మూ కాశ్మీర్‌.. అంతా రోహిత్‌ వల్లే?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement