3 వికెట్లతో ఐర్లాండ్‌పై విజయం
లాడర్‌హిల్ (ఫ్లోరిడా): పేలవ ఆటతో ‘సూపర్–8’ అవకాశాలు కోల్పోయిన పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ అతి కష్టమ్మీద నెగ్గి టి20 వరల్డ్ కప్‌ను ముగించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.
గారెత్ డెలానీ (19 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, జోష్ లిటిల్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాహిన్ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా... ఆమిర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది.
ఒకవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయినా... కెప్టెన్ బాబర్ ఆజమ్ (34 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) చివరి వరకు నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాహిన్ అఫ్రిది (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్‌లు) జట్టును గట్టెక్కించాడు.
టి20 ప్రపంచకప్‌లో నేడు
బంగ్లాదేశ్ X నేపాల్
వేదిక: కింగ్స్‌టౌన్; ఉదయం గం. 5 నుంచి
నెదర్లాండ్స్ X శ్రీలంక
వేదిక: గ్రాస్ ఐలెట్; ఉదయం గం. 6 నుంచి
న్యూజిలాండ్ X పాపువా న్యూగినీ
వేదిక: ట్రినిడాడ్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment