
Pro Kabaddi League- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–26 స్కోరుతో పుణేరీ పల్టన్‌ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. పట్నా తరఫున గుమాన్ సింగ్ 13 పాయింట్లు స్కోర్ చేయగా, పుణేరీ ఆటగాళ్లలో అస్లమ్ ఇనామ్‌దార్ 9 పాయింట్లు సాధించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 18 మ్యాచ్‌లు ఆడిన పట్నా పదమూడింట గెలిచి 70 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది.
ఇదిలా ఉండగా... బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. బెంగాల్ తరఫున మణీందర్ సింగ్, ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ చెరో 16 పాయింట్లు స్కోర్ చేశారు.
చదవండి: Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment