న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 36–33తో బెంగాల్ వారియర్స్‌ను కంగుతినిపించింది. హరియాణా రైడర్ వికాశ్ కండోలా 11 పాయింట్లతో చెలరేగాడు. మరో రైడర్ వినయ్ 9 పాయింట్లతో వికాశ్‌కు చక్కని సహకారం అందించాడు. బెంగాల్ వారియర్స్ రైడర్ మణీందర్ సింగ్ 15 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్‌గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 35–30తో పుణేరి పల్టన్‌పై నెగ్గింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment