కోల్‌కతా: ఆరంభంలో కనబరిచిన జోరును తుదికంటా ప్రదర్శించకపోవడంతో తెలుగు టైటాన్స్‌కు పరాజయం ఎదురైంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 25-29 తేడాతో ఓడింది. దీంతో పట్నా 20 పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్లింది.
తొలి పది నిమిషాలు ఆధిక్యాన్ని చూపిన టైటాన్స్ ఆ తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. పట్నా తరఫున పర్దీప్ నర్వాల్ 11 పాయింట్లు సాధించాడు. టైటాన్స్ నుంచి సుకేశ్ హెగ్డే 8, రాహుల్ చౌధరి 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారి యర్స్ 34-17 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది.
టైటాన్స్ ఓటమి
Published Tue, Feb 9 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM
Advertisement
Advertisement