దబంగ్‌ ఢిల్లీకి  పదో విజయం | Dabang Delhis tenth win in pro Kabaddi League | Sakshi
Sakshi News home page

దబంగ్‌ ఢిల్లీకి  పదో విజయం

Published Mon, Dec 24 2018 5:43 AM | Last Updated on Mon, Dec 24 2018 5:43 AM

Dabang Delhis tenth win in pro Kabaddi League - Sakshi

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్‌ ఢిల్లీ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరిన ఆ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 37–31తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలుపొందింది. ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన దబంగ్‌ ఢిల్లీ తొలి సగం ముగిసే సమయానికి 20–14తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా జోరు కనబరిచి చివరకు విజయం సాధించింది. ఢిల్లీ తరఫున మిరాజ్‌ షేక్‌ 13 పాయింట్లతో మెరవగా... బెంగాల్‌ వారియర్స్‌ తరఫున మణీందర్‌ 9, భూపేందర్‌ 5 పాయింట్లు సాధించారు. లీగ్‌లో నేడు విశ్రాంతి రోజు. మంగళవారం జరుగనున్న మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తమిళ్‌ తలైవాస్, బెంగాల్‌ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement