Pro Kabaddi League 2024: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌.. సీజన్‌లో పదో పరాజయం | Pro Kabaddi 2024: Telugu Titans Lost To Bengal Warriors, 10th Defeat In The Season | Sakshi
Sakshi News home page

Telugu Titans Vs Bengal Warriors: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌.. సీజన్‌లో పదో పరాజయం

Published Wed, Jan 10 2024 7:01 AM | Last Updated on Wed, Jan 10 2024 8:44 AM

Pro Kabaddi 2024: Telugu Titans Lost To Bengal Warriors, 10th Defeat In The Season - Sakshi

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు 26–46తో బెంగాల్‌ వారియర్స్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో టైటాన్స్‌ జట్టుకిది పదో పరాజయం.

టైటాన్స్‌ జట్టులో కెపె్టన్‌ పవన్‌ సెహ్రావత్‌ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. పవన్‌ 11 పాయింట్లు స్కోరు చేశాడు. వారియర్స్‌ జట్టులో వైభవ్‌ 9 పాయింట్లు, నితిన్‌ 9 పాయింట్లు, విశ్వాస్‌ 8 పాయింట్లు, శుభమ్‌ 6 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తమిళ్‌ తలైవాస్‌; యు ముంబాతో హరియాణా స్టీలర్స్‌ తలపడతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement