
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లో పట్నా పైరేట్స్‌కు నాలుగో విజయం...! జోన్ ‘బి’లో గురువారం జరిగిన మ్యాచ్‌లో పట్నా 29–27తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. దీంతో సొంత గడ్డపై చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. పట్నా కెప్టెన్, ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ గాయంతో బెంచ్‌కే పరిమితమైన ఈ మ్యాచ్‌లో దీపక్ నర్వాల్ 7 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు. ట్యాక్లింగ్‌లో జైదీప్ (5 పాయింట్లు) రాణించాడు.
బెంగాల్ వారియర్స్ తరఫున రాన్‌సింగ్ 7, మహేశ్‌గౌడ్ 6, జాంగ్ కున్ లీ 5 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఇరు జట్లు 25–25తో నిలిచాయి. ఈ దశలో నర్వాల్ రైడింగ్‌లో పాయింట్ సాధించడం, ఆ వెంటనే కున్ లీ ఔట్ కావడంతో దక్కిన 2 పాయింట్ల ఆధిక్యాన్ని పట్నా కొనసాగించి గెలుపొందింది. శుక్రవారం యూపీ యోధాతో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్ తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment