
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లో దబంగ్ ఢిల్లీ రెండో విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన డిఫెన్స్‌తో అదరగొట్టిన దబంగ్ ఢిల్లీ 39–30తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. దబంగ్ ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 11, చంద్రన్ రంజిత్ 7 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యా క్లింగ్‌లో రవీందర్ పహల్ (4 పాయిం ట్లు) ఆకట్టుకున్నాడు. బెంగాల్ వారియర్స్ తరఫున జాంగ్ కున్ లీ 10, మణిందర్ సింగ్ 6, మహేశ్ గౌడ్ 5 రైడ్ పాయింట్లు సాధించారు ట్యాక్లింగ్‌లో సుర్జిత్ సింగ్ (2 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ 27–25తో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్; తమిళ్ తలైవాస్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment