ముంబాకు వరుసగా ఎనిమిదో గెలుపు | Mumbai in a row for the eighth win | Sakshi
Sakshi News home page

ముంబాకు వరుసగా ఎనిమిదో గెలుపు

Published Mon, Feb 29 2016 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

Mumbai   in a row for the eighth win

ముంబై: సొంత వేదికపై  ముంబా జట్టు మరోసారి ఆకట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 30-27 పాయింట్ల తేడాతో గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబా జట్టుకిది వరుసగా ఎనిమిదో విజయం కాగా... ఓవరాల్‌గా పదోది. ఇప్పటికే పట్నా పైరేట్స్, ముంబా జట్లు సెమీఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకోగా... మిగతా రెండు స్థానాల కోసం పుణేరి పల్టన్ (43 పాయింట్లు), బెంగాల్ వారియర్స్ (42 పాయింట్లు), తెలుగు టైటాన్స్ (38 పాయింట్లు) రేసులో ఉన్నాయి. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement